Manda krishna: మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసింది

సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ. రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ విమర్శించారు.మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని… నమ్మించి నట్టేట ముంచిందని మంద కృష్ణ విమర్శించారు.

మాదిగల పట్ల ఎనలేని ప్రేమ ఉన్నట్టు నటిస్తూ… మాలల కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. మాలలకు అనుకూలంగా ఉంటూ… మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ తీరును నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మాలలకు ఎక్కువ టికెట్లు ఇచ్చి, మాదిగలకు తక్కువ సీట్లు ఇచ్చారని అన్నారు.

రేవంత్ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలకు నాలుగు సీట్లు తగ్గాయని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నాలు చేయాలని చెప్పారు. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ind-Pak: పాకిస్తాన్ కు మరో షాక్..ఫ్లైట్స్ ఎంట్రీకి నో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *