Manchu Vishnu: మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న చిత్రం కన్నప్ప. అయితే కొంత మంది నెటిజన్లు కన్నప్పను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో మంచు విష్ణు స్పందించాడు.ఏదైనా క్లిప్‌ను కట్ చేసి దాన్ని వైరల్ చేసి ట్రోల్స్, కాంట్రవర్సీ చేస్తే … వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ మధ్య జనాలు కూడా చాలా స్మార్ట్‌గా తయారయ్యారు. ఏదైనా కాంట్రవర్సీ అయితే పూర్తి వీడియోను నెట్టింట సెర్చ్ చేసి చూస్తున్నారు.
మరికొందరు మాత్రం పెద్ద న్యూసెన్స్ చేస్తున్నారు. అయినా అలాంటివి పట్టించుకోనని చెప్పుకొచ్చాడు విష్ణు. అలాగే కన్నప్ప ను ట్రోల్ చేయడంపై నటుడు రఘు బాబు స్పందించారు. కన్నప్పను ట్రోల్ చేసిన వారు కచ్చితంగా శివుడి ఆగ్రహం, శాపానికి గురవుతారు జాగ్రత్తని ట్రోలర్లను హెచ్చరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక హిందీ సీరియల్ మహా భారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, దేవరాజ్, విష్ణు కూతుళ్లు మంచు అవ్రామ్, అర్పిత్ రంకా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.