Mancherial: డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన కొందరు మద్యంప్రియులకు భలే శిక్ష పడింది. పోలీసులు ఎంత చైతన్యం తెస్తున్నా, కోర్టులు ఎంతగా శిక్షలు విధిస్తున్నా ఇంకా మర్పు అనేది రాకున్నది. ఇప్పటికీ ఎందరో దొరికితేనే కదా.. దొంగ అనుకుంటూ తప్పతాగి వాహనాలు నడుపుతూ తప్పించుకొని తిరుగుతున్నారు. దొరికిన వారికి సాధారణ శిక్షలే కదా.. ఏమున్నది అనుకుంటూ ఈజీగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాలలో జడ్జి ఓ నలుగురికి వినూత్న శిక్షను అమలు చేశారు.
Mancherial: ఇటీవల డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులను పోలీసులు మంచిర్యాల రెండో అడిషనల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఆ న్యాయమూర్తి ఓ నలుగురికి వినూత్న శిక్షను విధించారు. మిగతా వారికి వేర్వేరు శిక్షలు విధించారు. మంచిర్యాల బస్టాండ్ ఆవరణలో క్లీనింగ్ చేయాలంటూ ఆ నలుగురికి జడ్జి శిక్ష విధించారని ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ వెల్లడించారు. మరో 14 మందికి ట్రాఫిక్ అసిస్టెంట్ విధులు వేసినట్టు పేర్కొన్నారు. మిగతా వారికి రూ.17,500 జరిమానా విధించారని తెలిపారు.

