Tandel: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘తండేల్’. ఫిబ్రవరి 7న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ‘హైలెస్సో… హైలెస్సా’ అనే పాటను లాంచ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించిన ఈ పాటను శ్రీమణి రాయగా, శ్రేయ ఘోషల్ పాడారు. పాట విడుదల సందర్భంగా నాగచైతన్య స్టూడెంట్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘బుజ్జితల్లి పాటను హిట్ చేసినట్టే… ఈ పాటనూ ఆదరిస్తారనే’ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈచ ఇత్రాలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయని, అద్భుతమైన ఎమోషనల్ లవ్ స్టోరీ ఇదని దర్శకుడు చందూ మొండేటి చెప్పారు. నాగచైతన్య అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, అతని కెరీర్ బెస్ట్ గా నిలవడమే కాకుండా హయ్యస్ట్ గ్రాసర్ మూవీగా నిలుస్తుందని అల్లు అరవింద్ తెలిపారు.
