Mokshagna: నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా ఉంటుందని అతని పుట్టిన రోజున అధికారిక ప్రకటన వచ్చింది. దీనిని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తో కలిసి చెరుకూరి సుధాకర్ నిర్మించబోతున్నారు. ఇటీవల ఆ సినిమా ప్రారంభోత్సవం అనూహ్యంగా రద్దు కావడంతో ఆ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చుననే ఊహాగానాలు చిత్రసీమలో చెలరేగాయి. మోక్షజ్ఞ మరో ప్రాజెక్ట్ లోకి షిఫ్ట్ అయ్యాడనీ వార్తలు వచ్చాయి. అయితే దీనిని చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది. ప్రశాంత వర్మ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ మొదటి చిత్రం ఉంటుందని, పుకార్లను నమ్మవద్దని, సరైన సమయంలో మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ను అధికారిక సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తామని ప్రకటించింది.
Killer: ‘కిల్లర్’ సెకండ్ షెడ్యూల్ పూర్తి!
”శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ మూవీస్ తో దర్శకుడు పూర్వాజ్ చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతని తెరకెక్కిస్తున్న సినిమా ‘కిల్లర్’. ఈ స్పై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఆయనే హీరోగా నటిస్తున్నారు. జ్యోతి పూర్వాజ్ హీరోయిన్. మరో ఇద్దరు హీరోలుగా విశాల్ రాజ్, గౌతమ్ యాక్టస్ చేస్తున్నారు. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘కిల్లర్’ సినిమా సెకండ్ షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీ, వికారాబాద్ ఫారెస్ట్, హైదరాబాద్ లలో చిత్రీకరించామని మేకర్స్ తెలిపారు. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలతో ఈ సినిమా ఉంటుందని హీరో కమ్ డైరెక్టర్ పూర్వాజ్ అన్నారు.