Thandel Movie: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘తండేల్’. ఫిబ్రవరి 7న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ‘హైలెస్సో… హైలెస్సా’ అనే పాటను లాంచ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించిన ఈ పాటను శ్రీమణి రాయగా, శ్రేయ ఘోషల్ పాడారు. పాట విడుదల సందర్భంగా నాగచైతన్య స్టూడెంట్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘బుజ్జితల్లి పాటను హిట్ చేసినట్టే… ఈ పాటనూ ఆదరిస్తారనే’ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈచ ఇత్రాలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయని, అద్భుతమైన ఎమోషనల్ లవ్ స్టోరీ ఇదని దర్శకుడు చందూ మొండేటి చెప్పారు. నాగచైతన్య అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, అతని కెరీర్ బెస్ట్ గా నిలవడమే కాకుండా హయ్యస్ట్ గ్రాసర్ మూవీగా నిలుస్తుందని అల్లు అరవింద్ తెలిపారు.
Thandel Movie: ఇక తండేల్ మూవీపై మేకర్స్ ఎంత ఆశలు పెట్టుకున్నారో అంతకు మించి నాగ చైతన్య తో పాటు అక్కినేని ఫ్యామిలీ కూడా విజయం సాధించాలని ఆశిస్తున్నారు. నాగచైతన్య కెరీర్ కి తండేల్ మూవీ చాలా కీలకం కానుంది. ఇప్పటికే వెనుకబాటులో ఉన్న చైతన్య . . ఈ సినిమాతో తన తరం హీరోల్లో పైచేయి సాధించాలంటే ఈ సినిమా విజయవంతం కావడం చాలా అవసరం . ఈ సినిమా హిట్ అయితే నాగ చైతన్య కెరీర్ గాడిలో పడుతుందని అక్కినేని అభిమానులు కూడా భావిస్తున్నారు . సాయిపల్లవి హీరోయిన్ కావడంతో మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ కూడా పెరిగాయి . అలాగే ఇప్పటివరకూ విడుదలైన పాటలు , టీజర్స్ అన్నీ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి . సాధారణ ప్రేక్షకులు కూడా తండేల్ మూవీపై పెద్ద అంచనాలే పెట్టుకున్నారు . ఈ నేపథ్యంలో మేకర్స్ తండేల్ సినిమా చాలా బాగా వచ్చింది అని చెబుతుండడం విధులకు ముందు మూవీపై హైప్ మరింత పెంచింది .
మొత్తంగా చూసుకుంటే , తండేల్ మూవీ బిగ్గెస్ట్ హిట్ కావాలని అందరూ కోరుకుంటున్నారు .