Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మెయిన్‌పురి జిల్లాలోని ఫరుఖాబాద్ రోడ్డులో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే, వేగంగా దూసుకొచ్చిన ఒక ట్రక్కు అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.