ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్పాట్ డెడ్

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేరు ఉద్యోగి దుర్మరణం చెందిన సంఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు వివరాల ప్రకారం… గచ్చిబౌలీ లోని జెంటాక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీస్ కి హిమాయత్ నగర్ నుండి క్యాబ్ లో సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో సాయి తేజ, సాయి సుధ, సందీప్, మాధురి, సాయి కృష్ణ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు.

ఎర్టిగా కారులో మాసబ్ ట్యాంక్ గుండా ఫ్లైఓవర్ ఎక్కుతుండగా బైకును ఓవర్టేక్ చేసే క్రమంలో డివైడర్ ను ఢీకొన్నారు. ఈ సంఘటనలో ముందు సీటులో కూర్చున్న సాఫ్ట్ వేరు ఉద్యోగి సాయి తేజ(25) అక్కడికి అక్కడే మృతి చెందగా మిగిలిన నలుగురికీ గాయాలయ్యాయి.

వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా క్యాబ్ డ్రైవర్ కి సాయి వంశి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సిఐ తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: ప్రియుడే కావాలి.. భర్తను కూతురిని చంపిన భార్య.. 500 జరిమానా విధించిన కోర్ట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *