హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్‌పేట్‌లోని టీకేఆర్ కమాన్ దగ్గర లారీ వేగంగా వచ్చి ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. యాక్సిడెంట్ గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.