Mahesh kumar goud: సర్పంచ్ ఎన్నికలపై పీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

Mahesh kumar goud: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. ఈ విషయంలో మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

అలాగే, బీఆర్‌ఎస్ పార్టీ పాలనను తీవ్రంగా ఆక్షేపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని నీళ్లలో కలిపేశారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ద్వారా జరిగిందంతా అవినీతి మయం అని ఆయన ఆరోపించారు.

బనకచర్ల రిజర్వాయర్ విషయంలో ప్రభుత్వం తడబడదని మహేష్ గౌడ్ హామీ ఇచ్చారు. ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్‌ పోరాడుతుందని చెప్పారు.

అంతేకాక, గతంలో బీఆర్‌ఎస్ పాలనలో రాజకీయ నేతలు, సినీ తారలు, న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర తమది మాత్రమేనని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  CM Chandrababu: సీఎం చంద్రబాబు: క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను అందిపుచ్చుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *