Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ అరుదైన ప్రపంచ రికార్డును స్థాపించారు. ప్రపంచంలో ఏ సూపర్ స్టార్ వల్ల కాని రికార్డును తాను మాత్రమే సొంతం చేసుకున్నాడు. అదేమిటంటే.. 2005లో తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అతడు సినిమా స్టార్ మా తెలుగు ఛానల్ లో ఇప్పటివరకు ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయి సంచలనం సృష్టించింది. ఇంతవరకు ఏ హీరో సినిమా ఇలా టెలికాస్ట్ అవలేదు. హాలీవుడ్ హీరోల వల్ల కూడా కాలేదు. ఈ సినిమాను టెలికాస్ట్ చేస్తున్న ప్రతిసారీ విపరీతమైన రేటింగ్ వస్తోంది. దీంతో స్టార్ మా తెలుగు యాజమాన్యం పదే పదే టెలికాస్ట్ చేసింది. అలా ఎన్నిసార్లు చేస్తున్నప్పటికీ ఛానల్ కు ఆదాయం వచ్చిందే కానీ ఏమాత్రం తగ్గలేదు. మొత్తానికి పాత సినిమాతో కూడా సూపర్ స్టార్ మహేష్ ఇలా రికార్డులు సృష్టించడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్.
