Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఈసారి ఆయన పుట్టినరోజు ఆగస్టు 9 ఒక పెద్ద పండగ రోజు కానుంది. ఎందుకంటే తాము ఎంతగానో ఎదురు చూస్తున్న SSMB29, SSMB30 సినిమాలకు సంబంధించిన భారీ అప్డేట్స్ రాబోతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న SSMB29 ఒక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో అద్భుత విజువల్స్‌తో రానుంది. ఒడిశాలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read: Tollywood: రీ-ఎంట్రీ రచ్చ: కమ్‌బ్యాక్‌లో తేలిపోయిన సీనియర్ నటీమణులు!
మరోవైపు, SSMB30ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారని, నాగ వంశీ నిర్మిస్తున్నారని టాక్. ఈ చిత్రం మహేష్ బాబు యాక్షన్‌తో పాటు ఎమోషనల్ డ్రామాకు ప్రాధాన్యత ఇస్తుందని సమాచారం. ఈ రెండు సినిమాల అప్డేట్స్ అభిమానుల ఆతృతను మరింత పెంచనున్నాయి.

