Maharastra: అంబేద్కర్ స్మారకం విధ్వంసానికి నిరసనగా మహారాష్ట్రలోని పర్భానీలో బుధవారం చేపట్టిన బంద్ సందర్భంగా హింస చెలరేగింది. పర్భానిలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేసి తగులబెట్టారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో లాఠీచార్జి కూడా చేశారు. పర్భానీలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. పర్భానీకి ఆనుకుని ఉన్న హింగోలిలో కూడా హింస చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: NCRB Report: అయ్యో మగాళ్లు! ఆత్మహత్యల్లో 70 శాతం వారివే.
Maharastra: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సోపన్ దత్తారావు పవార్ మంగళవారం రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ స్మారకం వద్ద రాజ్యాంగ ప్రతిరూపాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ప్రజలు అతన్ని దారుణంగా కొట్టారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు
రాజ్యాంగ ప్రతిని పగులగొట్టే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు బుధవారం పర్భానీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బంద్ సందర్భంగా హింస చెలరేగింది. ప్రజలు విధ్వంసానికి దిగారు. పలు నివాస భవనాలపై కూడా రాళ్ల దాడి జరిగింది.

