AMARAVATHI VS YSRCP: భ్రమరావతి ప్రచారం అయిపోయింది. స్మశానం అంటూ పేలడం అయిపోయింది. ఇప్పుడు వేశ్యల రాజధానట. అమరావతిపై వైసీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతి పరులు నరనరాన పెంచుకున్న ద్వేషానికి నిదర్శనం ఈ మాటలు. మూడు రాజధానులు అన్న మాయలోడిని మూడు ప్రాంతాల్లోనూ ప్రజలు ఓటు అనే ఆయుధంలో లాగిపెట్టి కొట్టారు. అయినా ఇంకా బుద్ధి రాలేదా? ఏంటీ మాటలు? ఇలాంటి వికృత మాటలు మాట్లాడిస్తూ.. పైగా శాలువాలు కప్పమని, సన్మానం చేయమని నిస్సిగ్గుగా అడుగుతారా? మాటకు అటొకసారి, మాటకు ఇటొకసారి నా అక్కచెల్లెమ్మలు అనే పెద్దమనిషికి.. మహిళల పట్ల ఇంత చిన్న చూపా? ఇంత అహంకారం, ఇంత బలుపా? పొట్ట కూటి కోసం పడుపు వృత్తి చేసుకునే వారిని వేశ్యలు అంటే చట్టాలు కూడా ఒప్పుకోవు. అలాంటిది ఒక ప్రాంత మహిళలపై వేశ్యలు అనే ముద్ర వేస్తారా? నీచత్వానికి, బ్రష్టత్వానికి పరాకాష్టగా మారిన ఇలాంటి వారిని ఏం చేయాలి?
అమరావతి… ఒక కల, ఒక ఆశ, రైతుల రక్తంతో రాసిన చరిత్ర. కానీ, వైసీపీ ఈ పవిత్ర భూమిని కళంకితం చేస్తూ, మహిళల గౌరవాన్ని కాళ్ల కింద తొక్కుతోంది. అమరావతి వేశ్యల రాజధాని అంటూ స్త్రీ జాతిని అవమానిస్తూ వైసీపీ కాలకేయులు చేసిన వ్యాఖ్యలు… తెలుగు జాతి ఆత్మగౌరవంపై చేసిన దాడి. ఈ నీచ రాజకీయాలకు చెల్లించాల్సిన మూల్యం ఏమిటి?
అమరావతి.. రైతుల త్యాగాల స్మారకంగా, దేవతల నిలయంగా కీర్తించబడిన పవిత్ర భూమి. కానీ, వైసీపీ సొంత మీడియా ఈ పవిత్రతను కాలరాస్తూ, అమరావతిని ‘వేశ్యల రాజధాని’గా చిత్రీకరించేంత నీచస్థాయికి దిగజారింది. సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని ‘దేవతల రాజధాని’గా అభివర్ణించడాన్ని జీర్ణించుకోలేకపోయిన వైసీపీ.. దుర్బుద్ధితో తన సొంత చానల్‌లో ఒక లైవ్ డిబేట్ నిర్వహించింది. ఈ చర్చలో సీనియర్ జర్నలిస్టుని అని చెప్పుకునే ఓ వృద్ధకపోతం పాల్గొని.. అమరావతిలోని మహిళలను అవమానించేలా, రాష్ట్రాన్ని అంతా అపఖ్యాతి పాలు చేసేలా అసభ్య వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ద్వేషంలా అనిపించడం లేదు. సమాజంలోని స్త్రీ జాతిని కించపరిచే దుర్మార్గంగా కనబడుతోంది.
ఇది కూడా చదవండి: Chandrababu Schedule: ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు షెడ్యూల్
తుళ్లూరులో రాజధాని రైతులు, మహిళలు ఈ అవమానకర వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. “అమరావతి మా గుండె చప్పుడు, మా గౌరవం. మమ్మల్ని వేశ్యలంటూ అవమానించే ఈ నీచ రాజకీయాలను సహించం” అంటూ రైతులు, మహిళలు ఉద్యమ శిబిరం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. సదరు జర్నలిస్టుతో పాటూ… చానల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. “మా ఆడపడుచులను అవమానించిన వారిని వదిలేది లేదు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే, ఆ చానల్ కార్యాలయాలను ముట్టడిస్తాం,” అంటూ హెచ్చరించారు.
వైసీపీ గత ఐదేళ్ల పాలనలో అమరావతిని నిర్వీర్యం చేయడానికి ఎన్నో కుట్రలు పన్నింది. రైతుల భూములను తాకట్టు పెట్టి, వారి ఉద్యమాలను అణచివేసింది. అమరావతి మహిళలపై పోలీసులను ఉసిగొల్పి, లాఠీచార్జ్‌లు చేయించింది. “రంగు రంగుల చీరలు కట్టుకున్న వీళ్లు రైతులా?” అంటూ మహిళల వస్త్రధారణను కూడా అవమానించారు. ఇన్నాళ్లూ.. వైసీపీ తన సొంత మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులను కూర్చోబెట్టి… అమరావతిని ‘బ్రమరావతి’గా బురద చల్లించింది. తమ పార్టీ నేతలతో అమరావతిని ‘స్మశానం’ అంటూ మాట్లాడించింది. ఇప్పుడు మరింత దిగజారి.. అమరావతి ‘వేశ్యల రాజధాని’ అంటూ బరితెగించి మాట్లాడిస్తోంది. ఈ వ్యాఖ్యలపై యావత్ మహిళా లోకం కన్నెర్ర చేస్తోంది. “అమరావతి మహిళలను అవమానించడం వైసీపీ సంస్కృతి. ఇది రాజకీయం కాదు, నీచత్వం.” అంటూ మహిళలు ఖండిస్తున్నారు. “వైసీపీ చానల్‌లో ఈ డిబేట్ చూస్తే సిగ్గుతో తల దించుకునేలా ఉంది. ఇంత దిగజారుడుతనం ఎక్కడా చూడలేదు.” అంటూ ఖండిస్తున్నారు మహిళా మణులు. అమరావతి రైతుల త్యాగం, మహిళల గౌరవం ఈ ద్వేషపూరిత రాజకీయాలకు బలి కాకూడదు అని మహిళా సమాజం ముక్త కంఠంతో నినదిస్తోంది.
వైసీపీ నీచ రాజకీయాలకు వ్యతిరేఖంగా, అమరావతి మహిళలు, రైతులు మరో ఉద్యమానికి సిద్ధమౌతున్నారు.