Ilaiyaraaja

Ilaiyaraaja: 15 ఏళ్లలోపు చిన్నారులకు ఇళయరాజా గోల్డెన్ ఛాన్స్?

Ilaiyaraaja: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తన కుమార్తె భవతారణి స్మారకార్థం ‘భవత గర్ల్స్ ఆర్కెస్ట్రా’ ప్రారంభిస్తున్నారు. 15 ఏళ్లలోపు ప్రతిభావంతులైన బాలికలు మాత్రమే ఇందులో సభ్యులు. గానం, వాయిద్యాల్లో నైపుణ్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Bigg Boss 9: బిగ్‏బాస్ 9 నుంచి ఫైర్ బ్రాండ్ మాధురి ఎలిమినేట్

భారతీయ సంగీత రంగంలో తనదైన ముద్ర వేసిన ఇళయరాజా మరో అద్భుత నిర్ణయంతో మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. తన కుమార్తె భవతారణి స్మృతికి ‘భవత గర్ల్స్ ఆర్కెస్ట్రా’ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆర్కెస్ట్రాలో 15 ఏళ్లలోపు ప్రతిభావంతులైన బాలికలు మాత్రమే ఉంటారు. గతంలో ఈ ఆలోచన పంచుకున్న ఇళయరాజా ఇప్పుడు ఆచరణలోకి తెచ్చారు. సంగీతంపై మక్కువ ఉన్న చిన్నారులకు ఇది జీవిత మలుపు. గాయనీలు, వాయిద్యకారిణులు భాగమవ్వవచ్చు. సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేసిన ఇళయరాజా.. పేరు, వయస్సు, అనుభవం, ఫోన్ నెంబర్‌ను allgirlsorchestra@gmail.comకు పంపాలని సూచించారు. ఎంపికైనవారు ఇళయరాజా సారథ్యంలో ప్రాక్టీస్ చేసి, లైవ్ కచేరీల్లో పాల్గొంటారు. భవతారణి తమిళ సినిమాల్లో హిట్ పాటలు అందించిన గాయని, దర్శకురాలు. గత ఏడాది జనవరి 24న క్యాన్సర్‌తో మృతి చెందారు. ఆమె స్మారకంగా ఈ ఆర్కెస్ట్రా చిన్నారులకు గొప్ప వేదికగా నిలుస్తుంది. కొత్త తరానికి స్ఫూర్తి నింపనుంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *