Health Tips: దొండకాయలను రోజూ ఒక కప్పు మోతాదులో తింటే శరీరానికి పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే డయాబెటిస్, మూత్రాశయ వ్యాధులు, చర్మ సమస్యలు తగ్గుతాయని, కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయని అంటున్నారు. దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని, వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుందని పేర్కొంటున్నారు.
Health Tips: మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. ఆకుల కషాయం తాగితే జ్వరం, కామెర్లు, క్యాన్సర్ సమస్యలు తగ్గుతాయి. దొండకాయ ఆకులను పేస్టులా చేసి అప్లై చేస్తే చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దొండకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, బి1, సి మరియు కాల్షియం ఉంటాయి.
ఇది కూడా చదవండి: Kalki 2898: జనవరి 3న జపాన్ లో ‘కల్కి2898ఎడి’
Health Tips: ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మీ గుండె సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. జాక్‌ఫ్రూట్‌లోని ఫ్లేవనాయిడ్‌లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అవి మీ హృదయాన్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి. దొండకాయలను తినడం వల్ల బరువు సులభంగా అదుపులో ఉంటుంది. బరువు తగ్గడానికి సహాయపడే ఫైబర్ ఇందులో ఉంటుంది. మీరు బరువు తగ్గించే డైట్‌లో ఉన్నట్లయితే, మీరు దొండకాయలను మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.