LYF: స్టార్ సింగర్ SP చరణ్ చాలా ఏళ్ళ తర్వాత ‘లైఫ్’ (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాతలుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రాబోతుంది.
Also Read: Mad Square: మ్యాడ్ స్క్వేర్: ఆకట్టుకుంటున్న మరో మాస్ సాంగ్!
శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా SP చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా.. వంటి నటీ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మూవీ టీం తెలిపింది. ఈ నెల 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపనున్నట్లు తెలిపారు.
LYF(లవ్ యువర్ ఫాదర్) – అధికారిక టీజర్ :