Viral News: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఒక దారుణమైన ఘటన ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. గోమతినగర్‌లోని పత్రకార్‌పురంలో ఒక యువకుడు వీధి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
ఏం జరిగింది?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన ఆగస్టు 7న జరిగింది. వినాయక్‌ఖండ్‌కు చెందిన 24 ఏళ్ల సోను విశ్వకర్మ అనే యువకుడు కుక్కలకు ఆహారం ఇస్తున్నట్లు నటించి, ఒక కుక్కను తన దగ్గరకు పిలిచాడు. ఆ తర్వాత దానిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష చర్యను గమనించిన ఎవరో వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో, పలువురు జంతు ప్రేమికులు, ఆస్రా ది హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి, ఫిర్యాదులతో పోలీసులు వెంటనే స్పందించారు. విచారణ జరిపి వీడియోలో ఉన్న యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు.
ఈ ఘటన జంతువుల పట్ల కొందరు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో మరోసారి తెలియజేసింది. ఇలాంటి దారుణాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.