Lokah

Lokah: లోక చాప్టర్ 1 చంద్ర బుకింగ్స్ లో సంచలనం!

Lokah: లోకః చాప్టర్ 1 చంద్ర సినిమా బాక్సాఫీస్‌లో అద్భుతమైన రన్‌ను కొనసాగిస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించిన ఈ సూపర్ హీరో చిత్రం, విడుదలైన తొలి రోజున గంటకు వెయ్యి టికెట్ల కంటే తక్కువ విక్రయాలతో సామాన్యంగా మొదలైంది. అయితే, సినిమాపై పాజిటివ్ టాక్ విపరీతంగా పెరగడంతో, ఇప్పుడు బుక్ మై షోలో గంటకు 8 వేల టికెట్లతో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ చిత్రం తెలుగు సినిమాల్లో మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా రికార్డు సృష్టించింది. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాపై వస్తున్న ప్రశంసలు, ఈ ట్రెండ్‌ను మరింత బలపరిచాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KCR దెబ్బకు నోరు మూసుకున్న కాంగ్రెస్ ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *