Weekend Alcohol: వీకెండ్ రాగానే కొందరు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మరికొందరు పార్టీ ప్లాన్ చేసుకుంటారు. మరికొందరు బంధువుల ఇంటికి లేదా ఫంక్షన్లకు వెళతారు. హాలీడేనే అని అందరూ కలిసి మందు కొడతారు. కానీ కొంతమంది నేను ప్రతిరోజూ తాగను. వారానికి ఒకసారి మాత్రమే తాగుతామని తమను తాము సమర్థించుకుంటారు. మీరు వారిలో ఒకరైతే, వెంటనే మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. ఎందుకంటే వీకెండ్స్‌లో మద్యం సేవించడం కూడా ప్రమాదకరమని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Weekend Alcohol: వీకెండ్స్‌లో మద్యం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారానికి ఒకసారి తాగేవారు రోజు తాగేవారి కంటే ఎక్కువగా తాగుతారు. ఇది హై బీపీ సహా ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఆఫ్రికన్ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం వెల్లడించింది. వీకెండ్స్‌లో ఆల్కహాల్ తాగేవాళ్లు హైబీపీ సమస్యకు గురవుతారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వారాంతంలో తాగితే ఆ తర్వాతి వారంలో బీపీ పెరుగుతుంది. ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో బీపీ ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Khammam District: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకులంలో దారుణ ఘటన
వీకెండ్స్ ఆల్కహాల్ వల్ల కలిగే నష్టాలు
Weekend Alcohol: పార్టీలు, ఫంక్షన్లు, వీకెండ్స్‌లో మద్యం సేవించడం వల్ల కాలేయంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా దీర్ఘకాలిక కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. అదనంగా, రక్తపోటు పెరుగడంతో పాటు హృదయ సంబంధ వ్యాధులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది. ఆల్కహాల్ మెదడు కెమిస్ట్రీని ప్రభావితం చేస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవడం లేదా మూడ్ నియంత్రణను దెబ్బతీస్తుంది. మితిమీరిన ఆల్కహాల్ వినియోగం, అరుదుగా ఉన్నప్పటికీ అది ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమికి కారణమవుతుంది. మరోవైపు ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇది కండరాల రికవరీని తగ్గిస్తుంది. ఆల్కహాల్ చెడు ఆహారపు అలవాట్లకు దారితీస్తుంది.
ఇది కూడా చదవండి: Cyber Criminals: సైబర్ నేరగాళ్లకు చిక్కిన ప్రముఖ సినీనటి.. లక్షల్లో మునిగిందిగా
ఇలా చెక్ పెట్టండి
Weekend Alcohol: ప్రతివారం మద్యం సేవించడం ఒక్కోరోజు అలవాటుగా మారుతోంది. మద్యం లేకుండా వీకెండ్స్‌లో ఉండలేని పరిస్థితికి దారితీస్తుంది. అది మెల్లిగా రోజు తాగే స్థితికి తీసుకొస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. కాబట్టి వీకెండ్స్‌లో మద్యపానం నుండి విరామం తీసుకోవడం బెటర్. కుటుంబసభ్యులతో గడపడంతో పాటు వ్యాయామం, ధ్యానం, యోగా మొదలైనవి చేస్తే కొంత రిలీఫ్ ఉంటుంది. ఈ విధంగా మద్యపానాన్ని తక్కువగా తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.