Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలలు, హాస్టళ్లతోపాటు ప్రభుత్వ ఇతర విభాగాల రెసిడెన్షియల్ స్కూళ్లకు తాళాలు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా అద్దెలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు ఈ చర్యలు దిగుతున్నారు. బకాయి అద్దెలు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో దసరా సెలవులను ముగించుకొని వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది బయటే ఉండాల్సిన పరిస్థితులు పలుచోట్ల ఎదురయ్యాయి.
Telangana: రాష్ట్రంలోని హుజూర్‌నగర్, తుంగతుర్తి, బెల్లంపల్లి, తాండూరు, వరంగల్, భూపాలపల్లి, తొర్రూరు ప్రాంతాల్లోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు వసతి గృహాలకు ఆయా భవనాల యాజమానులు తాళాలు వేసి, అధికారులకు నోటీస్‌లను అందజేస్తున్నారు. నెలలుగా అద్దెలు చెల్లించాలంటూ వారు చెప్తున్నారు. బకాయిలు చెల్లిస్తేనే తాళాలు తీస్తామని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Telangana: భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు పాఠశాల యాజమాని తాళం వేశాడు. దీంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, బోధన సిబ్బంది బయటే నిరీక్షించాల్సి వచ్చింది. మంత్రి ఇలాకాలోనే ఇలా జరగడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Telangana: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌కు 10 నెలలుగా అద్దె చెల్లించడం లేదని యాజమాని దానికి తాళం వేశారు. నెలనెలా అడుగుతున్నా తనకు నిరీక్షణ తప్పలేదని, ఇక చేసేది లేక తాళం వేసినట్టు యాజమాని చెప్పారు. ఇలా పలుచోట్ల పాఠశాలలు, వసతి భవనాలకు యాజమానులు తాళాలేస్తున్నారు.