Lavanya Tripathi: వరుణ్ తేజ్ తో వివాహానంతరం నటి లావణ్య త్రిపాఠి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల ‘మిస్ పర్ ఫెక్ట్’ వెబ్ సీరిస్ లో నటించి మెప్పించిన లావణ్య ఇప్పుడు ‘సతీ లీలావతి’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేయబోతోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. గతంలో ‘భీమిలీ కబడ్డి జట్టు, ఎస్.ఎం.ఎస్.” వంటి చిత్రాలను రూపొందించిన తాతినేని సత్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra: హమ్మయ్య.. మహారాష్ట్ర మంత్రివర్గం కొలువు తీరింది
Lavanya Tripathi: నాగమోహన్ బాబు ఎం., రాజేశ్ టి దీనిని నిర్మిస్తున్నారు. ‘సతీ లీలావతి’ చిత్రంతో మరోసారి డిఫరెంట్ రోల్, ఎగ్జయిటింగ్ స్టోరీతో ప్రేక్షకులను లావణ్య త్రిపాఠి మెప్పించబోతున్నారని మేకర్స్ తెలిపారు. అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూర్చుతున్నారు.