HIT 3: న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘హిట్-3’ కోసం అభిమానుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో నాని రక్తపాత సీన్స్‌తో ప్రేక్షకులను స్టన్ చేయనున్నాడని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, మిక్కీ జే మేయర్ సంగీతంతో ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్న చిత్ర యూనిట్ సెన్సార్ పనులను పూర్తి చేసింది. అయితే, రిలీజ్‌కు కొద్ది గంటల ముందు రన్‌టైమ్‌ను ట్రిమ్ చేస్తూ సర్‌ప్రైజ్ ఇచ్చారు. 2 గంటల 30 నిమిషాలుగా ఉన్న సినిమా నిడివిని 5-8 నిమిషాలు తగ్గించేందుకు శైలేష్ టీమ్ కొన్ని సీన్స్‌ను ఎడిట్ చేస్తోంది. ఫైనల్ కాపీ లాక్ అయిన తర్వాత థియేటర్లకు పంపనున్నారు. ఈ ట్రిమ్మింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. ‘హిట్-3’ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి!

