mahaa Effect

Lalitha Jewellery: లలిత జ్యువెలర్స్ దోపిడీ.. పాపం మోసపోయిన కస్టమర్లు

Lalitha Jewellery: ఒక్క యాడ్.. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అంటూ లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ చెప్పిన ఈ ఒక్క మాటతో ప్రజల్లో అందరికి నమ్మకం కలిగింది. బంగారం కొనాలి అంటే లలిత కె వెళ్ళాలి అనే రేంజ్ కి రీచ్ అయింది. బంగారు వ్యాపారంలో పారదర్శకతకు మారుపేరుగా నిలవాలని చెప్పుకున్న లలితా జ్యువెలరీస్ ఇప్పుడు తీవ్ర వివాదంలో కూరుకుపోయింది. తమ వ్యాపార వ్యూహాలతో, కస్టమర్ చైతన్యంతో వార్తల్లో నిలిచిన సంస్థ, తాజాగా తూకంలో మోసాలు, బంగారం మార్పిడి వంటి తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంపై ఏకంగా లీగల్ మెట్రాలజీ అధికారులు స్పందించి, విచారణకు సిద్ధపడటం మార్కెట్‌లో కలకలం రేపుతోంది.

తూకంలో తేడాలే ప్రధాన ఆరోపణ

బంగారు ఆభరణాల కొనుగోలులో తమకు అన్యాయం జరిగిందని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మొదలైంది. ముఖ్యంగా, విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి తమకు జరిగిన నష్టాన్ని వెల్లడించడం ఈ కేసులో కీలకంగా మారింది:

  • బాధితుడి ఆరోపణ: ఆరు నెలల క్రితం 46 గ్రాముల బంగారం కొనుగోలు చేయగా, ఆరు నెలల తర్వాత తిరిగి మార్చుకునేందుకు వెళ్లినప్పుడు ఆ బంగారం తూకం 40 గ్రాములకు తగ్గిందని తేలింది.
  • తేడా 6 గ్రాములు: ఆరు నెలల కాలంలో ఏకంగా ఆరు గ్రాముల తేడా రావడం అనేది కేవలం సహజ తరుగుదలకు మించిన మోసంగా పరిగణించబడుతోంది.

“డబ్బులు ఊరకే రావు” అంటూ కిరణ్ కుమార్ తరచూ చెప్పే మాటలు, ఇప్పుడు “ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారు” అనే తీవ్రమైన విమర్శలకు దారితీశాయి. “తూకంలో మోసాలతో నిలువు దోపిడీ” జరుగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Internal war in BJP: బీజేపీ పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉందా..!

రంగంలోకి లీగల్ మెట్రాలజీ అధికారులు

వినియోగదారుల హక్కులు, తూకాలు, కొలతలను పర్యవేక్షించే లీగల్ మెట్రాలజీ విభాగం ఈ ఆరోపణలను చాలా సీరియస్‌గా తీసుకుంది. మీడియాలో వచ్చిన కథనాలు, ఫిర్యాదుల ఆధారంగా అధికారులు స్పందించారు.

  • విచారణకు ఆదేశం: లలితా జ్యువెలరీ సంస్థల వ్యాపార లావాదేవీలపై, ముఖ్యంగా తూకాల్లో అవకతవకలపై అధికారులు ఆరా తీయనున్నారు.
  • బాధితులకు పిలుపు: లలితా జ్యువెలరీస్‌లో బంగారం కొనుగోలు చేసి మోసపోయినట్టు భావిస్తున్న ఇతర బాధితులు ఎవరైనా ఉంటే, తమను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. తద్వారా సమగ్ర విచారణకు అవకాశం ఏర్పడుతుంది.

ఈ పరిణామం, ఒకప్పుడు మార్కెట్‌లో తామే పారదర్శకతకు ప్రతీకగా చెప్పుకున్న సంస్థకు గట్టి ఎదురుదెబ్బగా మారింది.

విప్లవం వెనుక వ్యూహం

గతంలో, లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ ఇతర బంగారు దుకాణాల మోసాలను, తయారీ ఛార్జీల విధానాలను విమర్శించడం ద్వారా తమ బ్రాండ్‌ను బలంగా నిలబెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు సొంత సంస్థపైనే తూకం, మార్పిడి విషయంలో ఇలాంటి ఫిర్యాదులు రావడంతో, ఆయన పారదర్శకత సిద్ధాంతంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రస్తుతం తలెత్తిన ఆరోపణలు కేవలం వ్యాపార వ్యూహంలో భాగం కాదని, ఇది వినియోగదారుల నమ్మకాన్ని ఉల్లంఘించే అంశమని స్పష్టమవుతోంది. లీగల్ మెట్రాలజీ అధికారులు ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కిరణ్ కుమార్ ఈ ఆరోపణలకు ఎలా సమాధానం చెబుతారు అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

మీరు లలిత జువెలరీస్‌ బాధితులైతే, మీ అనుభవాన్ని, ఆధారాలను తెలియజేయడానికి ఈ నెంబర్లను సంప్రదించవచ్చు: 9505070051, 9010975111.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *