Kurnool

Kurnool: కర్నూల్‌ జిల్లాపై జగన్ ఫోకస్ వ్యూహం ఫలిస్తుందా

Kurnool: రాయలసీమ ముఖద్వారం కర్నూలు… ఇక్కడ గత పదేళ్లుగా వైసీపీ జెండా ఓరేంజ్‌లో రేపరెపలాడిందట… గతంలో మొత్తం సీట్లు సొంతం చేసుకొని ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరింది. అయితే గత ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీకి జిల్లా ప్రజలు గట్టిగానే షాకిచ్చారు. కర్నూల్‌ జిల్లాలో కేవలం రెండు సీట్లకే పరిమితం కావడంతో వైసీపీ క్యాడర్‌కు గట్టి షాక్ తగిలిందట… దానికి కారణాలు అనేకం అంటూ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చర్చించుకుంటున్నారు. వైసీపీలో సమన్వయలోపమే అసలు కారణం అంటూ ఆ పార్టీ ముఖ్య నేతలే భావించారట… ఇదే విషయాన్ని జగన్‌ వద్దకు చేర్చడంతో జిల్లా పార్టీని చక్కదిద్దే పనిలో భాగంగా కొన్ని దిద్దుబాటు చర్యలను వైసీపీ అధిష్టానం చేపట్టింది.

Kurnool: ఎన్నికలు ముగిసే వరకు కర్నూల్ జిల్లా వైసీపీ బాధ్యతలు వాల్మీకి వర్గానికి చెందిన మేయర్ బి. వై రామ‌య్య చూసుకునేవారు.ఎన్నికల అనంతరం ఆయనను తప్పించి ఆపదవిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి జిల్లా పగ్గాలు అప్పగించింది వైసీపీ అధిస్థానం.

ఇది కూడా చదవండి: Sajjanar: డిజిటల్ అరెస్టులు ఉండవు జాగ్రత్తా.. సజ్జనార్ ట్వీట్

Kurnool: జిల్లా నాయకత్వ మార్పుతో పంకా రెక్కలు సెట్ అయినట్టేనని, కొత్త సారథితో పార్టీకి కొత్త కళ వస్తుందని వైసీపీ క్యాడర్ భావించిందట… అయితే క్షేత్ర స్థాయిలో వైసీపీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టు ఆపార్టీ నేతల వ్యవహార శైలి చూస్తే ఇట్టే అర్థం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జిల్లాలో నాయకత్వ మార్పు జరిగిన తర్వాత జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఒకే వేదికపై కలిసిన సందర్భాలు పెద్దగా లేకపోవడం వారి మధ్య సమన్వయ లోపాన్ని చెప్పకనే చెబుతోందట.

Kurnool: కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు వంటి పార్టీ కార్యక్రమాల్లో జిల్లా నాయకులు ఎస్వీ మోహన్ రెడ్డితో కలిసి ఒకరిద్దరు నాయకులు మినహా ముఖ్య నేతలు ఎవ్వరూ పాల్గొనకపోవడంతో లుకలుకలు బయటపెడుతున్నాయని కార్యకర్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్థులు బుట్టా రేణుక, ఇంతియాజ్ అహమ్మద్, లాంటి నేతలు పార్టీ కార్యక్రమాల్లో కనబడటమే కష్టంగా మారిందట. ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలో ఉన్నపుడు పదవులు అనుభవించిన మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, చెన్నకేశవ్‌ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, కంగటి శ్రీదేవి లాంటి వారు పార్టీ కార్యక్రమాల్లో దూరంగా ఉన్నారని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంపై రైతులకు అండగా నిరసన కార్యక్రమంలో జిల్లాలో ఉన్నమాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు అందరూ పాల్గొన్నారు. అందరం కలిసి ఉన్నామని సంకేతం పంపారు. అయితే రానున్న నిరసన కార్యక్రమాల్లో అందరూ కలుస్తురా… అనేది మాత్రం చెప్పలేము.

ALSO READ  Hyderabad: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *