Jagan

Jagan: అవినాష్‌పై జగన్‌ అసహనం ఫ్యామిలీలో చిచ్చు మొదలైందా

Jagan: ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి కంచుకోట… రెండు దశాబ్దాలుగా ఇక్కడ వారు చెప్పిందే వేదం..చేసిందే చట్టం.కానీ 2024 సార్వత్రిక ఎన్నికలు వారి రాజకీయ భవిష్యత్తుని తలక్రిందులు చేసింది.మొన్నటి వరకు జీ హూజూర్ అన్న నేతలు… నేడు ఐ డోంట్ కేర్ అంటున్నారట… అదే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్‌ని కలవరపాటుకు గురి చేస్తోందట.వైసీపీ కీలక నేతలు జగన్‌కు గుడ్ బై చెబుతుంటే సొంత జిల్లాలో కూడా బాయ్ బాయ్ వైసీపీ అంటూ టీడీపీ గూటికి చేరడంతో జగన్ అసహానానికిలోనై తమ్ముడు అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారని జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది.

Jagan: కడప కార్పోరేషన్‌లో గత దశాబ్ద కాలంగా వైసీపీ అధికారంలో ఉంది. కడప కార్పోరేషన్‌లో 50 డివిజన్లకు 48 మంది వైసీపీ కార్పోరేటర్లు. ఒకరు ఇండిపెండెంట్, మరోకరు టీడీపీ నుంచి గెలిచి బలంగా ఉన్నారు. అయితే వైసీపీ నుంచి గెలిచినప్పటికీ తమ డివిజన్లలో ఎలాంటి అభివృద్ది జరగలేదనే ఆవేశంతో ఉన్నారట కార్పోరేటర్లు… ఇక్కడ అంతా అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులకు మాత్రమే పనులతో పాటు గౌరవం మిగిలిన వారిని కనీసం కార్పోరేటర్లుగా గుర్తించకపోవడంతో ఇప్పుడు తిరుగుబాటు చేసే స్థాయికి వచ్చారంట… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మాధవి రెడ్డి, సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడం జిల్లాలో సంచలనంగా మారింది

ఇది కూడా చదవండి: Bomb Threat: పరీక్షల వాయిదా కోసం.. బాంబు బెదిరింపులు పంపిన విద్యార్థులు

Jagan: కడప జిల్లాలో 8 మంది కార్పోరేటర్లు పార్టీ మారడంతో జగన్ హుటాహుటిన అవినాష్ రెడ్డి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారని సమాచారం.సొంత జిల్లా నేతలే పార్టీ వీడితే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని జిల్లా నేతలకు వార్నింగ్ ఇచ్చారట.అయితే జగన్ ఆదేశాలను ఎవరు పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం తమని ఏరోజు కలిసిన పాపాన పోలేదని పార్టీ కోసం ఎంత కష్టపడ్డా గుర్తించకుండా ఇప్పుడు గుర్తుకు వచ్చామా అంటూ ప్రశ్నిస్తున్నారట… కడప కార్పోరేషన్ ఇప్పుడు చేజారి పోతుందని జగన్ జిల్లాపై దృష్టి సారిస్తున్నారట .అవినాష్ రెడ్డిని రంగంలోకి దింపి బుజ్జగించే ప్రయత్నం చేసిన ఎవరూ కనీసం వినే స్థితిలో లేరని చర్చించుకుంటున్నారు.ఇప్పుడు పార్టీ మారిన 8 కార్పోరేటర్లు కాకుండా మరో 20 మంది తొందరలో టీడీపీ గూటికి చేరడం పక్కా అంటున్నారు.

ALSO READ  Odisha: వేట‌గాళ్ల ఉచ్చులో ప‌డ్డ చిరుత‌.. ఏం చేశారో తెలుసా?

Jagan: ఈ నెల 25 క్రిస్మస్ సందర్భంగా జిల్లాలో అడుగుపెట్టే నాటికి సగం మంది కార్పోరేటర్లు జంప్ అంటు జోరుగా ప్రచారం సాగుతుండడంతో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి జగన్ కు పూర్తి వివరాలు వెల్లడించారట… జిల్లా నేతలు ఎవరు తన మాట వినలేదని నువ్వే రంగంలోకి దిగాలని సూచించారట… మొత్తం మీద సొంత జిల్లా జరుగుతున్న పరిణామాలు జగన్‌కు నిద్రలేకుండా చేస్తున్నాయట… మరి జగన్ ఎలాంటి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *