Kumuram Bheem Asifabad: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి అనే 21 ఏండ్ల యువతిపై పులి దాడి చేసి చంపిన ఘటనను మరువక ముందే అదే జిల్లాలో మరో పులి రైతుపై దాడి చేసిన ఘటన చోటుచేసుకున్నది. ఇప్పటికే గన్నారం పరిసర గ్రామాల్లో పులి అలజడితో భయాందోళన నెలకొన్నది. పొలాల్లో పనులు చేసుకునే రైతులు, కూలీలు ప్రాణాలరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ పనులు చేసుకుంటున్నారు.
Kumuram Bheem Asifabad: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం దుబ్బగూడలో పొలంలో పనిచేసుకుంటున్న రైతు సురేశ్‌పై పెద్ద పులి దాడి చేసింది. ఈ దాడిలో సురేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. గన్నారంలో లక్ష్మి కూడా పత్తి ఏరుతుండగా పులి దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది.
Kumuram Bheem Asifabad: ఈ రెండు ఘటనలతో ఎప్పుడు, ఎటు నుంచి పులి దాడి చేస్తుందోనని ప్రజలు భయాందోళనతో గడుపుతున్నారు. పులి జాడకోసం అటవీ అధికారులు జల్లెడ పడుతున్నారు. గన్నారంలో దాడి చేసిన పులే, సురేశ్ అనే రైతుపైనా చేసిందా? అనే కోణంలో కూడా అటవీ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏదైమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.

