Kranthi Madhav: సెన్సిబుల్ చిత్రాల దర్శకుడిగా క్రాంతి మాధవ్ కు పేరుంది. ప్రస్తుతం అతను ‘డీజీఎల్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. గంటా కార్తీక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొత్త సంవత్సరం సందర్భంగా విడుదలైంది. ప్రేమ అనేది వన్ సైడ్ కాదు టూ సైడ్ కాదు 360 డిగ్రీస్ ఉంటుందని చెబుతూ ఈ మూవీ గ్లిమ్స్ రూపుదిద్దుకుంది. యువతీయువకులు గట్టిగా హగ్ చేసుకున్న ఈ విజువల్స్ ను చూస్తుంటే… ఇది పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రమని అర్థం అవుతోంది. ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ వి.ఎస్. దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’కు వర్క్ చేశారు. ఇక ఈ తాజా చిత్రం ‘డీజీఎల్’ కు ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నారు.