indigo airlines:ముంబై నగరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానానికి భారీ ముప్పు తప్పింది. విమానంలో ఒక్కసారికి సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పైలెట్.. హైదరాబాద్ ఏటీసీ నుంచి అనుమతి తీసుకొని శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నారు.
indigo airlines:సురక్షితంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడంతో తొలుత అందరిలో ఆందోళన నెలకొన్నది. ఆ తర్వాత క్షేమంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.