Koratala Siva: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్! ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర’ ఈ సినిమా విడుదల అయిన తర్వాత భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రాజమౌళి కర్స్ ని బ్రేక్ చేశారు ఎన్టీఆర్ .. దింతో తర్వాత రెండో పార్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, తాజాగా ‘దేవర 2’పై అనూహ్య వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను ఆపేసే ఆలోచనలో ఉన్నారా? కొరటాల శివ స్క్రిప్ట్ సిద్ధం చేసినా, ఎన్టీఆర్ ఫోకస్ మారిందా? ఈ నిర్ణయం వెనక అసలు కారణాలు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Rajinikanth: 74 ఏళ్ల యువకుడు.. రజనీ వర్కౌట్ చూశారా!
‘దేవర’ సినిమా సక్సెస్ తర్వాత, దాని సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ స్క్రిప్ట్ రెడీ చేసి, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ ‘దేవర 2’ను తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో ఉన్నటు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ పూర్తయ్యాక, త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్‌లతో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కారణంగా ‘దేవర 2’ ఎక్కువ కాలం వాయిదా పడటం పక్కా. అందుకే ఈ గ్యాప్ లో కొరటాల శివ నాగచైతన్య కోసం కొత్త స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారని సమాచారం ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయి.