Keeravani

Keeravani: ఇళయరాజా స్వరరచన, కీరవాణి గీత రచన

Keeravani: రూపేష్ కథానాయకుడిగా మా ఆయి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా ‘షష్టిపూర్తి’. నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న అర్చన ఇందులో ప్రధాన తారాగణం. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ విడుదలైన 38 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్షా సింగ్ ఇందులో రూపేష్ సరసన కథానాయికగా నటించారు. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. ఈ సినిమాలోని ‘ఏదో ఏ జన్మ లోదో’ సాంగ్ త్వరలో విడుదల చేయనున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Winter Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి కంపల్సరీ

Keeravani: ఈ సినిమాలో ఉన్న నాలుగు పాటలకు చైతన్య ప్రసాద్ రచన చేయగా, ఒక పాటను కీరవాణి రాశారని దర్శకుడు పవన్ ప్రభ తెలిపారు. ఇళయరాజా గారి బాణీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు సాహిత్యం అందించడం, అది తమ చిత్రంలో పాట కావడం నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. కీరవాణి ఇప్పటివరకూ 60 పై చిలుకు పాటలు రాశారు కానీ , ఇళయరాజా గారి బాణీకి రాయడం ఇదే ప్రథమమని చెప్పారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందని, త్వరలోనే విడుదల తేదీ చెబుతామని హీరో, నిర్మాత రూపేష్ కుమార్ చౌదరి చెప్పారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pushpa: శభాష్ పుష్ప అబద్ధాల్లో నెంబర్ వన్ అంటూ నెటిజన్ల ఫైర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *