పుకారు కాదు… ముద్దుతో ధ్రువీకరించారు!
కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా తీరంలో ఒక చిన్న పడవలో ట్రూడో, కేటీ పెర్రీతో రొమాంటిక్‌గా గడుపుతున్న ఫోటోలను ‘ది డైలీ మెయిల్’ పత్రిక ప్రచురించింది. ఈ వైరల్ చిత్రాలు వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా ధ్రువీకరించాయి.
ఈ ఫోటోలలో కేటీ పెర్రీ నల్లటి స్విమ్‌సూట్‌లో కనిపించగా, చొక్కా లేకుండా ఉన్న జస్టిన్ ట్రూడో ఆమెను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మరో ఫోటోలో ట్రూడో, పెర్రీ చెంపపై ముద్దు పెడుతూ ఇద్దరూ హాయిగా గడుపుతున్నట్లు కనిపిస్తోంది.
ప్రత్యక్ష సాక్షి సంచలన వ్యాఖ్యలు:
తిమింగలాలను చూసే పడవ పక్కన వీరి పడవ ఆపారని, మొదట్లో ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని ఒక ప్రత్యక్ష సాక్షి ‘ది డైలీ మెయిల్’తో చెప్పారు. “ఆ వ్యక్తి చేతిపై ఉన్న టాటూ (పచ్చబొట్టు) చూసి, అది జస్టిన్ ట్రూడో అని నేను వెంటనే గ్రహించాను” అని ఆ సాక్షి చెప్పినట్లు కథనం పేర్కొంది.
ఇది కూడా చదవండి: NDA Seat Sharing: బిహార్‌లో NDA సీట్లు సర్దుబాటు.. బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లు
ఎక్కడ మొదలైంది ఈ కథ?
- ఈ జంట మొదటిసారిగా ఈ ఏడాది జూలైలో మాంట్రియల్లో జరిగిన విందు సందర్భంగా కలిసి కనిపించారు.
- ఆ తర్వాత, కెనడాలోని కేటీ పెర్రీ ‘లైఫ్‌టైమ్స్’ టూర్ స్టాప్‌కు ట్రూడో హాజరయ్యారు.
- ఇటీవల వీరిద్దరూ విడిపోయారని వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఈ ముద్దుల ఫోటోలు బయటపడడం విశేషం.
ఇద్దరి వ్యక్తిగత జీవితాలు:
ట్రూడో, పెర్రీ ఇద్దరూ తమ గత బంధాల నుంచి విడిపోయినవారే.
- జస్టిన్ ట్రూడో: 18 ఏళ్ల వివాహం తర్వాత, 2023 ఆగస్టులో తన భార్య సోఫీ గ్రెగోయిర్ ట్రూడో నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరికి జేవియర్ (17), ఎల్లా-గ్రేస్ (16), హాడ్రియన్ (11) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
- కేటీ పెర్రీ: ఆమె గతంలో నటుడు రస్సెల్ బ్రాండ్ నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత, నటుడు ఓర్లాండో బ్లూమ్‌తో ఏడు సంవత్సరాలు సహజీవనం చేసిన ఆమె, ఆరు సంవత్సరాల నిశ్చితార్థం తర్వాత 2025 జూన్‌లో విడిపోయింది. ప్రస్తుతం వీరు తమ కుమార్తె డైసీ డోవ్ను కలిసి పెంచుకుంటున్నారు.
ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని, అంతర్జాతీయ పాప్‌క్వీన్ ప్రేమ బంధం ఇప్పుడు గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త జంట తమ సంబంధాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.