Karnataka: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ. 4,08,647 కోట్ల బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, సినీ పరిశ్రమ అభివృద్ధి వంటి అంశాలను ప్రాముఖ్యతతో చర్చించారు.
సినీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం టికెట్ ధరలను రూ. 200గా నిర్ణయించాలని యోచిస్తోంది. మల్టీప్లెక్స్‌లు సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకూ ఇదే ధర అమలవుతుందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. సామాన్య ప్రజలు కూడా సినిమాలను సులభంగా ఆస్వాదించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూరులో ఒక ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని కేటాయించామని సీఎం ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు రూ. 500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, కన్నడ చిత్రపరిశ్రమను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.