karnataka

Karnataka: హెయిర్ డ్రైయర్ కేసులో ట్విస్ట్.. అది హత్యా ప్రయత్నమే

Karnataka: కర్నాటకలో ‘హెయిర్‌ డ్రైయర్‌’ పేలడంతో మహిళ రెండు చేతులూ కోల్పోయిన విషయం తెలిసిందే. మొదట ప్రమాదంగా ఈ ఘటనను భావించారు. కానీ, దర్యాప్తులో ఇది ఆ మహిళపై హత్యాప్రయత్నంగా తేలింది. హెయిర్ డ్రైయర్ లో డిటోనేటర్‌ అమర్చి ఆ మహిళను హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేశారు

కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్ జిల్లా ఇలగల్‌లో నివాసం ఉంటున్న 35 ఏళ్ల బసమ్మ అనే ఆమె భర్త ఆర్మీలో పనిచేస్తూ చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఇంటి పక్కనే పక్కనే శశికళ నివసిస్తోంది. ఇద్దరూ స్నేహితులు. కొన్ని రోజుల క్రితం, శశికళకు కొరియర్ ద్వారా పార్శిల్ వచ్చింది. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు. దీంతో తనకు ఫోన్ చేసిన కొరియర్ బాయ్ కి పార్సిల్ పక్కింటిలోని బసమ్మకు ఇవ్వాల్సిందిగా చెప్పింది. నిజానికి శశికళ ఏ వస్తువూ ఆర్డర్ చేయలేదు. కానీ, డెలివరీ  బాయ్ మీ పేరుమీద పార్సిల్ ఉంది.. అని పదే పదే చెప్పడంతో ఆమె దానిని పక్కింట్లో ఇవ్వాలని చెప్పింది. 

పార్సిల్ తీసుకున్న బసమ్మ  దాన్ని విడదీసి చూడగా ‘హెయిర్ డ్రయర్’ దొరికింది. దాని వైర్‌ని ప్లగ్‌లోకి ప్లగ్ చేసి ‘ఆన్’ చేయడంతో ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడు ధాటికి  బసమ్మ రెండు చేతులు ఛిద్రమై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్ కు మరిన్ని భద్రతా దళాలు.. కేంద్రం ప్రకటన

Karnataka: ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఇలగల్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇలాకల్‌లో నివాసముంటున్న సిద్దప్ప శిలవంత అనే వ్యక్తి  బసమ్మ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన శశికళ శివలంతను హెచ్చరించింది. ఇది పధ్ధతి కాదంటూ చెప్పింది. దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్న శశికళను హతమార్చేందుకు శీలవంత పథకం పన్నాడు. హెయిర్ డ్రైయర్‌లో డిటోనేటర్‌ను అమర్చి శశికళ ఇంటికి కొరియర్ ద్వారా పంపించారు. కానీ, తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచినట్లు.. శశికళపై అందాల్సిన పార్శిల్ బసమ్మకు అందింది. దానిని ఉపయోగించేక్రమంలో డిటొనేటర్ పేలి చేతులను కోల్పోయింది శివలంత ప్రియురాలు బసమ్మ.

కొరియర్ కంపెనీలో  పార్శిల్ ఎవరు పంపారని పోలీసులు ఆరా తీయగా అది శీలవంత అని తేలింది. దీంతో తమదైన స్టైల్ లో అతన్ని పోలీసులు విచారించారు.  శశికళను హతమార్చేందుకు హెయిర్ డ్రైయర్‌లో డిటోనేటర్‌ను తానే అమర్చినట్లు అతడు అంగీకరించాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *