Manipur: మణిపూర్‌లో మరో 11 వేల మంది భద్రతా బలగాలను మోహరిస్తారు. 90 కంపెనీల సాయుధ బలగాలకు చెందిన 10,800 మంది భద్రతా బలగాలను మోహరిస్తామని మణిపూర్ ప్రధాన భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ తెలిపారు.
ఇప్పటికే చాలా వరకూ భద్రతా దళాలు ఇంఫాల్‌కు చేరుకున్నాయి. భద్రతా దళ కంపెనీలను వివిధ ప్రాంతాలకు పంపిస్తున్నారు. త్వరలో మొత్తం మణిపూర్ అంతా ఈ దళాలు కవర్ చేస్తాయి.
ఇది కూడా చదవండి: Maharashtra -Jharkhand Election Results: మహారాష్ట్ర – జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు లైవ్
Manipur: CRPF, SSB, అస్సాం రైఫిల్స్, ITBP, ఇతర సాయుధ దళాల కంపెనీలను మణిపూర్‌లో మోహరించాయి. అదే సమయంలో నవంబర్ 16న ముఖ్యమంత్రి బీరెన్ సింగ్, 17 మంది ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు జరిగాయి. రాష్ట్ర మంత్రి ఎల్.సుసీంద్రో ఇంటిపైనా దాడి జరిగింది.
ఇప్పుడు సుసింద్రో ఇంఫాల్ ఈస్ట్‌లోని తన ఇంటిని ముళ్ల తీగలు, ఇనుప వలలతో పటిష్టం చేసుకున్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ- ఆస్తులను కాపాడుకోవడం మన రాజ్యాంగ హక్కు అన్నారు. మే నెల నుంచి ఇప్పటివరకూ మూడుసార్లు తన ఇంటిపై దాడి జరిగింది అని.. అందుకే తన ఇంటిని రక్షించుకునే ఏర్పాట్లు చేసుకున్నానని ఆయన వెల్లడించారు.