Karimnagar: గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు అందడం లేదని మాజీ సర్పంచ్ భర్త మనస్తాపానికి గురయ్యాడు. విసిగి వేసారడంతో ఆత్మహత్యే శరణ్యమని భావించాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నది.
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో తాళ్ల విజయలక్ష్మి తాజా మాజీ సర్పంచ్. తన సొంత భూమి, బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి పంచాయతీకి మంజూరైన అభివృద్ధి పనులను ఆమె భర్త రవితో కలిసి విజయలక్ష్మిం చేయించారు. రూ.11 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉన్నది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు బిల్లులు సమర్పించినా, అధికారులు పట్టించుకోవడం లేదని విజయలక్ష్మి చెప్పారు.
Karimnagar: ఏండ్లు దాటుతున్నా బిల్లులు మంజూరు కాలేదు. దీంతోపాటు అప్పులిచ్చిన వారు వేధింపులకు దిగడంతో తాజా మాజీ సర్పంచ్ విజయలక్ష్మి భర్త రవి మనస్తాపానికి గురయ్యాడు. ఇంటిలోనే ఉన్న గడ్డి మందు గుళికలను మింగి రవి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.