Kanguva sequel : 2027లో కంగువ సీక్వెల్.. ప్రకటించిన నిర్మాత

తమిళ నటుడు సూర్య, దిశాపఠానీ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన కంగువ మూవీ వచ్చే నెల 14న విడు దలవుతోంది. అయితే ఈ సినిమాకు సం బంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయం విడుదలకు ముందే వచ్చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాత జ్ఞానవేల్ ప్రకటించాడు. ‘‘శివ దర్శకత్వాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. దీని స్క్రిప్ట్‌ రాసుకున్నప్పుడే రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాం. రెండోభాగంలో ఉధ్రన్‌ పాత్ర (బాబీ దేవోల్‌ పాత్ర) మరింత వివరణాత్మకంగా ఉంటుంది. ‘కంగువా 2’ ప్రీ ప్రొడక్షన్‌ పనులు వచ్చే ఏడాది ప్రారంభమవుతాయి. 2026లో షూటింగ్‌ పూర్తి చేసి.. 2027లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అని నిర్మాత చెప్పారు.

2025లో షూటింగ్ ప్రారంభమవు తందని తెలిపారు. కంగువ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్లోలో కనిపించ నున్నారని సమాచారం. దిశాపటానీ కథానాయిక. బాబీ దేవోల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు తెర పైకి రాని ఓ కొత్త కాన్సెప్ట్ ఇందులో ఉందని, పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటి కే విడుదలైన ట్రైలర్ సినీప్రియుల ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

కంగువా సినిమా ప్రమోషన్‌లో భాగంగా సూర్య ఇటీవల ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ సమయంలో గజిని సినిమా గురించిన ప్రస్తావన రావడం జరిగింది. చాలా సంవత్సరాలుగా గజిని సీక్వెల్‌ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు మురుగదాస్ సైతం తప్పకుండా సీక్వెల్‌ చేస్తానని గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అయితే ఈసారి హీరో సూర్య సీక్వెల్‌ గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈసారి ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MAD Square: మ్యాడ్ స్క్వేర్ మెప్పించిందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *