Kangana Ranaut: కంగనా రనౌత్ రెండు భారీ సీక్వెల్ చిత్రాలతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్‌లో వికాస్ బహల్ దర్శకత్వంలో క్వీన్ 2 షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం 2014లో విడుదలైన క్వీన్ సినిమాకి సీక్వెల్‌గా రూపొందనుంది. ఈ సినిమా తర్వాత 2026 ప్రారంభంలో ఆర్. మాధవన్‌తో కలిసి తను వెడ్స్ మను 3 షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ రెండు చిత్రాలు కంగనా కెరీర్‌లో కీలకమైనవిగా నిలవనున్నాయి. క్వీన్ 2లో కంగనా పాత్ర మరింత బలమైన, స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అలాగే, తను వెడ్స్ మను 3లో మాధవన్‌తో కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ రెండు చిత్రాలతో కంగనా మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.

