Justice NV Ramana:జనగణనలో కులగణన చేపట్టనున్నట్టు కేంద్రం నిర్ణయించడంపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై కేంద్రానికి ఆయన అభినందనలు తెలిపారు. జనగణనలో కులగణన చారిత్రక అవసరం అని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
Justice NV Ramana:కులం ఆధారిత వివక్ష ఒక కఠినమైన వాస్తవమని జస్టిస్ ఎన్ రమణ పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని చాలా ఏళ్లుగా అంగీకరించకుండా విస్మరణకు మనం ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం చైతన్యంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైనదని పిలుపునిచ్చారు. జనగణనలో ప్రతి సామాజిక సూచికను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఇది సామూహిక ప్రయోజనాన్ని లక్ష్యంగా చేసుకున్న సమగ్ర వినియోగ ప్రక్రియగా మారాలని కోరుకున్నారు.
Justice NV Ramana:కులాన్ని ఒక గుర్తింపుగా తీసుకొని జనగణనలో కులగణన నిర్వహించడం, సరైన దిశలో వేసిన సాహసోపేతమైన అడుగుగా జస్టిస్ ఎన్ రమణ అభివర్ణించారు. సమాజంలోని అన్నివర్గాలకు అధికారంలో, ఆర్థికాభివృద్ధిలో తగిన వాటా లభించేలా చేయడంలో ఈ కులగణన తోడ్పడుతుందని పేర్కొన్నారు.

