jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే.. రెండో స్థానం మరో పార్టీకే దక్కుతుంది. ఆ పార్టీ మాత్రం మూడో స్థానానికే పరిమితం అవుతుంది.. ఇలా ఎందరో సర్వేలపై సర్వేలు వండి వారుస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తల్లో ఏది నిజం.. ఏది అసత్యం అనేది తేల్చుకునేందుకు నెటిజన్లు తంటాలు పడాల్సి వస్తున్నది. ఆయా పోస్టులపై ఇందులో నిజమెంత? అవాస్తవమెంత అని విమర్శలు, ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
jubliee hills By elections 2025: ఇప్పుడు జూబ్లీహిల్స్ రాజకీయం సర్వేల దశకు చేరుకున్నది. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ దశలో సర్వేలతో ప్రజలను ఏమార్చే పనిలో కొన్ని సంస్థలు పడ్డాయి. అనుకూల సర్వేలను వండి వారుస్తూ తాము మద్దతిచ్చే పార్టీలకు వంతపాడుతున్నాయి. ఇంకా బీఆర్ఎస్ మినహా ఇతర పార్టీల అభ్యర్థులే ఫైనల్ కాకున్నా ఇదే ఫలితమంటూ విశ్లేషణలను చేసి వదులుతున్నారు.
jubliee hills By elections 2025: ఇక్కడ మరో విషయం ఊరూవాడ లేని సర్వేలు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ప్రకటించి.. మాదే గెలుపు అంటూ ఆయా పార్టీలు బాకా ఊదుకుంటున్నాయి. మా పార్టీ గాలి విస్తుందంటూ కాదు మాపార్టీదే గెలుపు అంటూ మరో పార్టీ ప్రచారం చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా గ్రూపుల్లో విశేష ప్రచారం చేసుకుంటూ ఊదరకొడుతున్నాయి.
jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచార రంగంలోకి దిగింది. సానుభూతి ఓట్లతో కైవసం చేసుకునేందుకు గోపీనాథ్ సతీమణి సునీతకే ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ డివిజన్ల వారీగా ఆ పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలను అప్పగించింది.
jubliee hills By elections 2025: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికలో మల్లగుల్లాలు పడుతున్నది. ఇదే తరహాలో బీజేపీ కూడా ఆచితూచి అడుగేయాలని భావిస్తున్నది. ఇప్పటి వరకూ ఆ రెండు పార్టీల కంటే బీఆర్ఎస్ మాత్రం ముందస్తు ప్రచారాన్ని కొనసాగించే పనిలో పడింది. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.
jubliee hills By elections 2025: ఈ దశలో సర్వేల సడేమియా అన్నట్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సర్వేలు చేయకపోయినా, తామే చేసినట్టుగా ఫలితాలను ముందే బేరీజు వేస్తూ ఓట్ల పర్సెంటేజీలతో సహా తేల్చి చెప్తున్నారు. ఒక విచిత్రం ఏమిటంటే.. కాంగ్రెస్ తరఫున ప్రకటించే సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీకి మూడో స్థానం అని, బీఆర్ఎస్ కు అనుకూలంగా చేసే సర్వేల్లో కాంగ్రెస్ కు మూడో స్థానం అంటూ తేల్చి చెప్తుండటం.
jubliee hills By elections 2025: కొందరు డబ్బులు వసూలు చేసి ఫేక్ సర్వేలను జనంపైకి వదులుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొందరు సోకాల్డ్ జర్నలిస్టు స్ట్రాటజిసటులు డబ్బుకు దాసోహమై తమ ప్రయత్నాలను ఈ సర్వేల రూపంలో వెల్లడిస్తున్నారు. తమకు అనుకూలమైన రాజకీయ పార్టీలకు మద్దతుగా అనుకూల ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ సర్వేలను ఆయా పార్టీల క్యాడర్ కూడా నమ్మే పరిస్థితిలో లేకపోవడం గమనార్హం.