Narne Nithiin Marriage: టాలీవుడ్ యంగ్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ జీవితంలో ఆనందకర ఘట్టం చోటుచేసుకుంది. శివానీ అనే యువతిని జీవిత భాగస్వామిగా ఎంచుకుని వివాహ బంధంలో అడుగుపెట్టారు. శుక్రవారం (అక్టోబర్ 10) రాత్రి హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లిలో ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరగగా, సినీ మరియు రాజకీయ ప్రముఖులు, ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఎన్టీఆర్ ఫ్యామిలీ సందడి
ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్లతో కలిసి హాజరైన తారక్ ఈ వేడుకలో సందడి చేశారు. పెళ్లి వేడుకలోని ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెట్టింట హల్చల్ సృష్టిస్తున్నాయి. కొత్త దంపతులకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Mana tarak Anna 😍👌🔥 at Nithin naren wedding #JrNTR @tarak9999 pic.twitter.com/sRVaBcBZR6
— NTR Fans (@NTR2NTR_FC) October 10, 2025
వధువు కుటుంబ నేపథ్యం
శివానీ నెల్లూరు జిల్లాకు చెందిన తాళ్లూరి వెంకట కృష్ణ ప్రసాద్ – స్వరూప దంపతుల కుమార్తె. వీరి కుటుంబం రాజకీయంగా ప్రభావశీలంగా ఉండడమే కాకుండా టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబంతో దగ్గరి బంధుత్వం కలిగి ఉంది. సమాచారం ప్రకారం, శివానీ వెంకటేష్ కజిన్ డాటర్ అని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Delhi: రేపు రైతులకు డబుల్ గిఫ్ట్ – రెండు కీలక పథకాల ప్రారంభానికి సిద్ధమైన ప్రధాని మోదీ
నార్నే నితిన్ గురించి
నార్నే నితిన్ ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు కూడా. సినీ పరిశ్రమలోకి ఆయన 2023లో ‘మ్యాడ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంలోనే ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని, తక్కువ సమయంలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు.
#TFNExclusive: Man of Masses @tarak9999 gets papped in a classic traditional look at #NarneNithiin’s wedding ceremony! 📸🤍#JrNTR #NTRNeel #TeluguFilmNagar pic.twitter.com/xBLAYQ9Ye0
— Telugu FilmNagar (@telugufilmnagar) October 10, 2025
తర్వాత వచ్చిన ‘ఆయ్’ మరియు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలు కూడా విజయవంతం కావడంతో వరుస హిట్స్ సాధించారు. తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ విధంగా, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ తన ప్రతిభతో టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు.
ఎంగేజ్మెంట్ నుంచి వెడ్డింగ్ వరకు
గతేడాది నవంబర్ 3న నార్నే నితిన్–శివానీ నిశ్చితార్థం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, దగ్గుబాటి కుటుంబం, సినీ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. ఆ ప్రేమ బంధం ఇప్పుడు జీవిత బంధంగా మారడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.