Highest Selling Cars: ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన కార్లు: సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి ఎర్టిగా మారుతి బ్రెజ్జాను అధిగమించింది. సెప్టెంబర్ నెలలో 17,441 ఎర్టిగా కార్లు అమ్ముడయ్యాయి. టాప్-5 జాబితాలోని ఇతర కార్లు మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రెజ్జా, మహీంద్రా స్కార్పియో. ఫోర్డ్ ఎఫ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు.
Highest Selling Cars: భారత మార్కెట్‌లో మారుతీ సుజుకీ ఆధిపత్యం కొనసాగుతోంది. సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 15 కార్లలో మారుతీ కూడా ఉంది. సెప్టెంబర్‌లో అత్యధికంగా మారుతీ ఎర్టిగా కార్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్ ఒక నెలలోనే 17,441 ఎర్టిగా కార్లు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకి స్విఫ్ట్ 16,241 యూనిట్లను విక్రయించింది. మారుతీ సుజుకీకి చెందిన 9 మోడల్స్ టాప్ 15 లిస్ట్‌లో ఉన్నాయి. అలాగే, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన కారు ఫోర్డ్ ఎఫ్ సిరీస్. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 5,28,028 కార్లు అమ్ముడయ్యాయి.
Highest Selling Cars: మారుతీతో పాటు, టాటా, హ్యుందాయ్, మహీంద్రా కార్లు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. భారతదేశంలో అమ్ముడవున్న టాప్-15 కార్లలో మారుతీ సుజుకీ చెందిన కార్లే 9 ఉన్నాయి. టాటా, హ్యుందాయ్ కి చెందిన కార్లు ఈ లిస్ట్‌లో 2 ఉన్నాయి. అంతే కాకుండా ఈ లిస్ట్‌లో మహీంద్రా, కియా కార్లు ఒక్కోటి ఉన్నాయి.
సెప్టెంబర్ 2024లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయిన కార్లు
మారుతీ ఎర్టిగా: 17,441 కార్లు అమ్ముడయ్యాయి
మారుతీ స్విఫ్ట్: 16,241
హ్యుందాయ్ క్రెటా: 15,902
మారుతి బ్రెజ్జా: 15,322
మహీంద్రా స్కార్పియో: 14,438
మారుతీ బాలెనో: 14,292
మారుతీ ఫ్రాంక్స్: 13,874
టాటా పంచ్: 13,711
మారుతీ వ్యాగన్ ఆర్: 13,339
మారుతీ ఈకో: 11,908
టాటా నెక్సాన్: 11,470
మారుతి డిజైర్: 10,853
కియా సోనెట్: 10,335
మారుతి గ్రాండ్ విటారా: 10,267
హ్యుందాయ్ వేన్యూ: 10,259
2024లో గ్లోబల్ బెస్ట్ సెల్లింగ్ కార్లు
ఫోర్డ్ ఎఫ్ సిరీస్: 5,28,028 కార్లు
చేవ్రొలెట్ సిల్వరాడో: 3,99,604
టయోటా RAV4: 3,50,331
టెస్లా మోడల్ Y: 3,12,000
హోండా CR-V: 2,98,164
రామ్ పికప్: 2,68,666
GMC సియెర్రా: 2,29,011
టయోటా క్యామ్రీ: 2,27,576
నిస్సాన్ రోగ్: 1,89,156
హోండా సివిక్: 1,88,422