Pawan Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో జోష్ పీక్స్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఓజి’పై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దర్శకుడు సుజీత్ రూపొందిస్తోన్న ఈ సినిమా హైప్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఎప్పుడో రావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, ఇటీవలే షూటింగ్ ఊపందుకుంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ సడన్‌గా బిగ్ అప్‌డేట్‌ను విడుదల చేశారు. ‘ఓజి’ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ ఒకవైపు ఆశ్చర్యపోతూనే, మరోవైపు భారీ ఎగ్జైట్‌మెంట్‌లో మునిగిపోయారు.

Also Read: Karthik: పొంగల్ పోరుకి సిద్ధమైన కార్తీ?

Pawan Kalyan: ఈ చిత్రానికి సంగీత దర్శకుడు థమన్ బాణీలు సమకూరుస్తుండగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్, ఎమోషన్స్, స్టైలిష్ టేకింగ్‌తో ‘ఓజి’ సినిమా పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa News Effect: మహాన్యూస్ కథనాలకు స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. రేషన్ మాఫియా అక్రమార్కులపై స్వయంగా రంగంలోకి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *