Karthik

Karthik: పొంగల్ పోరుకి సిద్ధమైన కార్తీ?

Karthik: తమిళ స్టార్ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. విలక్షణ నటనతో అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించిన కార్తీ, తాజాగా సీక్వెల్ సినిమాలతో సందడి చేస్తున్నారు. అందులో ముఖ్యమైన చిత్రం ‘సర్దార్ 2’. డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ రూపొందిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ‘సర్దార్ 2’ ఈ ఏడాది విడుదల కాకపోవచ్చు. మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సీజన్‌లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగులోనూ ఈ సినిమా సంక్రాంతి రేసులో భాగమవుతుందని సమాచారం.

Also Read: DACOIT Glimps: అందరూ నిన్ను మోసం చేశారు.. ‘డకాయిట్‌’ ఫైర్‌ గ్లింప్స్‌ వచ్చేసింది.

Karthik: ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా, ఎస్.జే. సూర్య విలన్‌గా నటిస్తున్నారు. ఈ కాంబోతో ‘సర్దార్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది. కార్తీ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా ఓ విజయ బహుమతి అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gita Jayanti 2024: భగవంతుని గీతామృతం అర్ధం చేసుకుంటే బతుకు గీత మారుతుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *