CSK: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గుజరాత్ టైటాన్స్ (GT)పై 83 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అయితే, ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో IPL చరిత్రలో తొలిసారి చివరి స్థానానికి (10వ స్థానం) చేరుకుంది. 2020లో 7వ స్థానం (8 జట్లు), 2022లో 9వ స్థానం (10 జట్లు) లో నిలిచింది.
CSK, రాజస్థాన్ రాయల్స్ చెరో 8 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ, CSK నెట్ రన్ రేట్ (NRR) కొద్దిగా తక్కువగా ఉంది. చివరి స్థానాన్ని తప్పించుకోవాలంటే CSK కనీసం 109 పరుగుల తేడాతో GTని ఓడించాల్సి వచ్చింది, కానీ అది సాధ్యం కాలేదు. దీంతో వారు చివరి స్థానంతో సరిపెట్టుకున్నారు. ప్రస్తుత 10 జట్లలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మాత్రమే చివరి స్థానానికి చేరుకోలేదు,
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న CSK, డెవాన్ కాన్వే (52 పరుగులు), డెవాల్డ్ బ్రూవిస్ (57 పరుగులు) అర్ధ సెంచరీల బలంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోరు చేసింది. 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఒత్తిడిలో కుప్పకూలి 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సాయి సుదర్శన్ 28 బంతుల్లో 41 పరుగులు చేశాడు.
Also Read: Henrich Klaasen: 37 బంతుల్లో సెంచరీ.. వీళ్ల రికార్డులు బద్దలు!
CSK: ఐపీఎల్ చరిత్రలో, ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానంలో 4 సార్లు, పంజాబ్ కింగ్స్ 3 సార్లు నిలిచాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చెరో 2 సార్లు చివరి స్థానంలో నిలిచాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, పూణే వారియర్స్, డెక్కన్ ఛార్జెస్, మరియు CSK జట్లు ఒక్కోసారి అపఖ్యాతిని చవిచూశాయి.