Jelencky: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి పరోక్షంగా ఊతమిస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు విధించడం సమంజసమేనని ఆయన అన్నారు.
రష్యా చమురు కొనుగోలు అన్యాయం
జెలెన్‌స్కీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,”ఉక్రెయిన్‌ను విధ్వంసం చేస్తున్న రష్యాతో వ్యాపారం జరపడం అన్యాయం” అని స్పష్టం చేశారు.చమురు అమ్మకాల ద్వారా రష్యాకు వస్తున్న డాలర్లు ఉక్రెయిన్‌పై దాడులకు ఉపయోగపడుతున్నాయని ఆరోపించారు.
రష్యాతో వ్యాపారం కొనసాగించే దేశాలు, పరోక్షంగా యుద్ధానికి మద్దతు ఇస్తున్నట్లే అవుతుందని విమర్శించారు. అలాంటి దేశాలపై పన్నులు విధించడం తప్పేమీ కాదనితేల్చిచెప్పారు.
మోదీ శాంతి యత్నాలు
ఇదే సమయంలో, యుద్ధాన్ని ఆపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషి కొనసాగిస్తున్నారు.ఇటీవల పుతిన్‌తో భేటీకి ముందు జెలెన్‌స్కీతో టెలిఫోన్‌లో మాట్లాడారు.
పుతిన్‌తో భేటీ అనంతరం “యుద్ధం ముగింపుకు భారత్ సాధ్యమైన సహకారం అందిస్తుంది” అని మోదీ తెలిపారు.అలాగే, ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టబడి ఉందని చెప్పారు.