JC Prabhakar Reddy: అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ పేరు తెలియని వారు ఉండరు. 2019 ఎన్నికల్లో మాత్రం జేసీ బ్రదర్స్ వైసీపీ గాలికి కొట్టుకుపోయారుని చెప్పవచ్చు. గత 2019 నుంచి 2024 వరకు జేసీ కుటుంబానికి గడ్డు కాలమే అని చెప్పవచ్చు.గత ప్రభుత్వ హయాంలో అనేక కేసులు పోరాటాలు చేయాల్సి వచ్చింది. రాజకీయంగా జేసీ వారసులు పవన్ కుమార్ రెడ్డి, అస్మిత్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత వారి రాజకీయం మస్కబారపోతుందని అనుకున్నారు.2024 ఎన్నికల్లో జేసీ బ్యాక్ బౌన్ అయ్యారు. అయితే ఎలాగైనా తన బ్రాండ్‌ను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో జేసీ ప్రభాకర్ రెడ్డి సేవ్ తాడిపత్రి అనే నినాదంతో ప్రజలలోకి వెళ్లి రాష్ట్రంలో ఎక్కడ కూడా మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ గెలవకపోయినప్పటికీ కేవలం ఒక తాడిపత్రిలో మాత్రం టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
అప్పటి నుంచి చురుకుగా జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాలు మొదలు పెట్టారు. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో ఢీ అంటే ఢీ అన్పటుగా పోటీ పడ్డారు.2024 ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా జేసీ అస్మిత్ రెడ్డిని 27 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు స్థానిక ప్రజలు.జేసీ బ్రాండ్‌తో పాటు తాడిపత్రికి పూర్వం వైభవం తీసుకురావడానికి ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి 2025 కొత్త సంవత్సరం నుంచి భారీ మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు
ఇది కూడా చదవండి: Bandipotu Bheemanna: బందిపోటు భీమన్నకు 55 ఏళ్లు
JC Prabhakar Reddy: తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని డైలాగ్స్ మారుమోగుతున్నాయి.చిత్తూరు జిల్లాలో పుష్ప రూల్స్ అమలవాల్సిందే… తెర మీద మాత్రమే హీరో డైలాగులు చెబుతారు.అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం జేసీ బ్రదర్స్ రూల్స్ పాటించాల్సిందే అంటున్నారంటా… అవును నిజమే మేము చెప్పేది 2025 జనవరి ఒకటో తారీకు నుంచి తాడిపత్రిలో ఈరూల్స్ పాటించాల్సిందే అంట.. పట్టణంలో బ్యానర్లుతో పాటు ప్లాస్టిక్ నిషేధం అంటూ జేసీ రూల్స్ అమల్లోకి రాబోతున్నాయంట…తాడిపత్రి మున్సిపాలిటీ గతంలో రాష్ట్రంలో నెంబర్ -1 మున్సిపాలిటీగా దేశంలో రెండో స్థానం బెస్ట్ మున్సిపాలిటీగా రికార్డులలోకి ఎక్కింది.
JC Prabhakar Reddy: అయితే గత 5ఏళ్ళు కాలంలో మున్సిపాలిటీని వైసిపీ పట్టించుకోకపోవడంతో డ్రైనేజి, త్రాగునీరు, విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడకం, పరిసరాలు అపరిశుభ్రతతో దుర్గంధం వెదజల్లుతూ ప్రజలు త్రీవ అవస్థలు పడ్డారంటా… ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు పరుస్తూ బెస్ట్ మున్సిపాలిటీ చేసేలా అడుగులు వేయబోతున్నారా…ఇక తాడిపత్రిలో జనవరి ఒకటో తేది నుంచి ఫ్లెక్సీలు ఎక్కడపడితే అక్కడ కడితే కఠిన చర్యలు ఉంటాయంటూ ప్రజలకు జేసీ ఇప్పటికే ఒక సందేశం పంపించారు.ముఖ్యంగా ప్రముఖుల విగ్రహాల వద్ద ఏ రాజకీయ పార్టీ నాయకులు ఇతరులు ఎవరైనా సరే ఫ్లెక్సీలు పెట్టకూడదని.. మీరు పెట్టినా మున్సిపల్ అధికారులు తొలగించడం జరుగుతుందన్నారు. రూల్స్ అందరికీ ఒక్కటే చివరికి మా పార్టీ మా అభిమానులు జేసీ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లెక్సీలు సైతం వద్దని క్యాడర్‌కి స్పష్టంగా ఒక మెసేజ్ అయితే ఇచ్చారంట… మీకు డబ్బులు ఎక్కువ ఉంటే పట్టణ అభివృద్ధి కోసం అందజేయాలని కోరారు. మీ రిప్లై కట్టాలనుకుంటే మాత్రం ప్లెక్సీలు కోసం ప్రత్యేక స్థలం ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఫ్లెక్సీలు కట్టుకునే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వెసులుబాటు కల్పించారు.
JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డు దక్కింది. వీధీ దీపాలు, వాటర్ సప్లై వినియోగంలో విద్యుత్ ఆదా చేసినందుకు ఎనర్జీ స్పెషల్ చీప్ సెక్రటరీ విజయానంద్ అందచేశారు. పురాతన ఆలయాలకు మహర్దశ, టెంపుల్ సిటీ అఫ్ తాడిపత్రిగా పిలవబడుతూ శ్రీకృష్ణదేవరాయలు కాలంలో నిర్మించిన శ్రీ చింతల వెంకట రమణస్వామి, శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయాలు శిథిలావస్థకు చేరుకుని కల్యాణ మండపం, ప్రహరీలు పడిపోవడంతో కుంభాబిషేకం, పలు కార్యక్రమాలు చేసేందుకు నోచుకోలేదు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: బెనిఫిట్ షోలు లేనట్టే.. సీఎం రేవంత్ స్పష్టీకరణ
JC Prabhakar Reddy: శిల్పకళా సంపదకు నిలయమైన ప్రాచీన ఆలయాలలో పడిపోయిన వాటిని నిర్మించేందుకు సెంట్రల్‌తో మాట్లాడి అనుమతితో మా ప్రజలే దేవుళ్ళు ..మా ఊరే దేవాలయం అనే నినాదంతో పనులు ప్రారంభించి ముందుకు వెళ్తున్నారు.మరో ప్రత్యేకత ఏమిటంటే న్యూ ఇయర్ వేడుక..మహిళలకు మాత్రమే; తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 31న రాత్రి జేసీ పార్కులో కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వాటిని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేసినా సంచలమే ఏ నిర్ణయాలు తీసుకున్న చర్చించుకోవాల్సిందే. 2025 కొత్త సంవత్సరం నుంచి తాడిపత్రిలో జేసీ రూల్స్ పాటించాల్సిందంట.నో ప్లాస్టిక్ నో ఫ్లెక్సీ … అంటున్నారు జేసి… తాడిపత్రి ప్రజలు జేసి రూల్స్‌ను పాటిస్తారా… రూల్స్ అతిక్రమిస్తే ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తారో అనేది నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ… జేసీ ప్రభాకర్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపైన విమర్శలు ప్రతి విమర్శలకు దారితీస్తున్నాయి. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ తాడిపత్రిలో మాత్రం జేసీ రూల్స్ పాటించాల్సిందేనా… తాడిపత్రిలో కొత్త రూల్స్ అమలు చేస్తారా లేదా చూడాలి మరి
ఇది రాసిన వారు మల్లిబోయిన రామాంజనేయులు
సీనియర్ కరస్పాండెంట్
ఉమ్మడి అనంతపురం జిల్లా