Bandipotu Bheemanna: నటచక్రవర్తి యస్వీ రంగారావు ‘బందిపోటు భీమన్న’ గా టైటిల్ రోల్ పోషించిన చిత్రం 1969 డిసెంబర్ 25న విడుదలయింది… ఈ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల జంటగా నటించి అలరించారు… ఉన్నవారిని దోచి, లేనివారికి సాయపడే బందిపోటు భీమన్నను పట్టుకుంటే లక్ష రూపాయలు బహుమానం అని పోలీసులు ప్రకటిస్తారు… తన చెల్లెలి పెళ్ళి కోసం మోహన్ బందిపోటు భీమన్నను పట్టుకొని బహుమానం సంపాదించాలని చూస్తాడు.. చివరకు భీమన్నను తన మంచితనంతో బందీగా పట్టుకువస్తాడు మోహన్… భీమన్నను చూసిన ఆయన భార్య విషం తాగి మరణిస్తుంది..
ఇది కూడా చదవండి: Anandhi: ఆహాలో ఆనంది వైట్ రోజ్
Bandipotu Bheemanna: అది తట్టుకోలేక బందిపోటు భీమన్న తనను తాను కాల్చుకొని మరణిస్తాడు… మోహన్ తన చెల్లి ప్రేమించిన వాడితో ఆమె పెళ్ళి జరిపిస్తాడు… తాను కోరుకున్న అమ్మాయి చేయి అందుకుంటాడు… ఈ సినిమాలో రాజబాబు, చంద్రమోహన్, నెల్లూరు కాంతారావు, మీనా కుమారి, జ్యోతిలక్ష్మి, మంజుల నటించగా, అతిథి పాత్రల్లో చిత్తూరు నాగయ్య, అంజలీదేవి కనిపించారు. సి.నారాయణ రెడ్డి, కొసరాజు, ఆరుద్ర పాటలు పలికించారు.. టి.వి.రాజు స్వరకల్పన చేశారు… ఈ చిత్రాన్ని భాస్కర్ పిక్చర్స్ పతాకంపై పి.మల్లికార్జునరావు దర్శకత్వంలో దోనేపూడి బ్రహ్మయ్య నిర్మించారు..