Allu Arjun

Allu Arjun: ముంబైలో అల్లు అర్జున్ కొత్త అపార్ట్మెంట్.. నెక్స్ట్ 3 ఇయర్స్ అక్కడే..?

Allu Arjun: అల్లు అర్జున్ హైదరాబాద్ నుండి ముంబై షిఫ్ట్ అవుతున్నారు అంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది ఈ న్యూస్. ఇది నిజామా అంటే అవును అనే వినిపిస్తుంది. ఇప్పటికే 25 కోట్ల ఖరీదైన ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ ని ముంబైలో తీసుకున్నట్టు తెలుస్తుంది.

పుష్ప ఫ్రాంచైజ్ తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లో ఎక్కువగా ఆడింది అలాగే దేశాలు దాటి గుర్తింపు తెచ్చింది. దీంతో నెక్స్ట్ అల్లు అర్జున్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే తీస్తున్నారు. అట్లీ తో తీస్తున్న సినిమా నుండి లోకేష్ కనకరాజ్ తీసే సినిమాలు హై బడ్జెట్ తో పాటు ముంబైలో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన ప్రతిసారి హోటల్స్ లో ఉండడం కంటే అపార్ట్‌మెంట్ తీసుకుంటే బాగుంటుంది అనేది అల్లు అర్జున్ ఆలోచన. ఎందుకంటే నెక్స్ట్ 3 ఇయర్స్ ముంబై, హైదరాబాద్ తిరుగుతూనే ఉండాల్సి ఉంటుంది.

ముంబైలోని జుహు తార రోడ్ లో సీ ఫేసింగ్ అపార్ట్‌మెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ అపార్ట్‌మెంట్ రెంట్ నెలకు 16 లక్షలు. దీంతో నెక్స్ట్ 3 ఇయర్స్ కి లీస్ కి తీసుకున్నారు అంటే సుమారు 6 కోట్లు అనమాట. ఈ అపార్ట్‌మెంట్ లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అలాగే అంప్లె పార్కింగ్ (ample parking) అంటే ఎన్ని బండ్లు వచ్చినా పార్కింగ్ కి ఇబ్బంది కలగకుండా స్పేస్ ఉండడం. ఇంకా గ్రీనరీ ఉండేలా చూసుకున్నారు. దీంతో వర్క్ లేదా రిహార్సల్స్ చేసుకోవడానికి అలాగే సముద్రం నుండి వచ్చే సౌండ్ కూడా వినిపిస్తుంది.

ముంబై లో అపార్ట్‌మెంట్ కోసం చాలా రోజుల నుండి వెతుకుతున్న అల్లు అర్జున్, స్నేహ తమకి నచ్చిన సీ వ్యూ అలాగే పార్కింగ్, ఇంటీరియర్ డిజైన్ ఇలా అన్ని విషయాలు నచ్చడానికి కొంత టైమ్ తీసుకున్నారు. దీనికంటే ముందు చాలానే ఫ్లాట్స్ చూసినా అవి నచ్చకపోవడంతో చివరికి ఈ అపార్ట్‌మెంట్ తీసుకున్నారు.

అల్లు అర్జున్ తన టైమ్ ని హైదరాబాద్, ముంబై లో గడపనున్నారు. పిల్లలు అల్లు అయాన్ ఇంకా అల్లు అర్హ తమ స్కూల్ హాలిడేస్ లో ఇక్కడే ఉండనున్నారు.

అల్లు అర్జున్ తన మార్కెట్ ని పెంచుకోవడానికి ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే సెలెక్ట్ చేసుకునే ప్రతి స్టోరీ దానికి తగట్టుగానే ఉండేలాగా చూసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *