Revanth Reddy: సినిమా ఇండస్ట్రీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతోంది. సినిమాకు సంబంధించిన సమస్యలపై ఇటు ఇండస్ట్రీ ప్రతినిధులు చెబుతుంటే, ప్రభుత్వం సినీ పరిశ్రమ నుంచి ఏమి కోరుకుంటుంది అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో అసలేం జరిగింది అనే విషయాన్ని పోలీసులు వీడియో ప్రదర్సించారు. ప్రభుత్వం ఎవరి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ నుంచి తాము ఏమి కోరుకుంటున్నామో వివరించారు. ప్రభుత్వం సినీ ప్రతినిధులకు ఏమి చెప్పిందంటే..
సినీ ప్రముఖుల ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు ఇవే..
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా టాలీవుడ్ సహకరించాలి
ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలే ఉండాలి
టికెట్ల ధరలపై విధించే సెస్.. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు వినియోగించాలి
హీరో, హీరోయిన్లు డ్రగ్స్ నిర్మూలనపై యాడ్స్ చేయాలి
సినిమా రిలీజ్‌కు ముందు యాడ్ థియేటర్లలో ప్లే చేయాలి
ర్యాలీలపై నిషేధం విధిస్తారు
కులగణన సర్వే పై ప్రచారానికి ముందుకు రావాలి
బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండవు
Revanth Reddy: ఇక ఇదే సందర్భంలో శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. అలాగే, ఇక బౌన్సర్లపై సీరియస్‌గా మని చెప్పిన ఆయన అభిమానులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రేటీలదే అని స్పష్టం చేశారు. అదేవిధంగా ఇండస్ట్రీతో ప్రభుత్వం ఉందన్న భరోసా ఇచ్చిన సీఎం టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలనీ, పెట్టుబడుల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలనీ కోరారు.
Revanth Reddy: సమావేశంలో సినీ ఇండస్ట్రీ తరఫున అల్లు అరవింద్, సురేష్‌బాబు, మైత్రీ రవి, నాగవంశీ, నవీన్, సి కల్యాణ్, గోపీ ఆచంట, శ్యాంప్రసాద్‌రెడ్డి, నాగార్జున, వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడీ, బోయపాటి శ్రీను, వీరశంకర్, రాఘవేంద్రరావు, మురళీమోహన్, హరీష్ శంకర్ ఇతరులు పాల్గొన్నారు. మొత్తంగా సినీ పరిశ్రమ నుంచి 46 మంది సభ్యులు హాజరయ్యారు. వారిలో 22 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నారు.